నర్వ మండలంలోని యంకె గ్రామ ప్రజలు సీసీకెమెరాల ఏర్పాటుకు గ్రామ ప్రజల సాయం అభినందనీయమని ఎస్సై కురుమయ్య అన్నారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలు 70 వేల రూపాయల చెక్కును మంగళవారం ఎస్సైకి అందజేశారు. మండలంలోని యంకి గ్రామంలో ఎస్సై కురుమయ్య ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై కురుమయ్య మాట్లాడుతూ గ్రామాల్లో దొంగతనాలు నివారించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.