రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం సోయి లేదని బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం మరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ చిన్నా భిన్నంగా తయారైందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కనీసం విద్యా శాఖకు మంత్రిని కూడా నియమించలేని స్థితిలో ముఖ్య మంత్రి ఉండడం సిగ్గుచేటన్నారు.