మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై-నాసిక్ హైవేపై కాసారా ఘాట్ సమీపంలో సిమెంట్ లోడ్‌తో వెళుతున్న ట్రక్కు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ట్రక్కులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.