దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఒకరికి ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. లాతూర్‌కు సంబంధించిన కేసులో గంగాధర్ అప్ప అనే వ్యక్తిపై సీబీఐ కేసు నమోదు చేసింది. బెంగళూరులో అతడిని అరెస్ట్ చేసింది. అయితే నిందితుడికి బదులుగా అదే పేరున్న గంగాధర్ గుండె అనే మరో వ్యక్తిని సీబీఐ అరెస్ట్ చేసినట్లు కోర్టు గుర్తించింది.