తెలంగాణకు త్వరలో కొత్త సీఎస్?

52చూసినవారు
తెలంగాణకు త్వరలో కొత్త సీఎస్?
తెలంగాణకు కొత్త సీఎస్ రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్‌ ముగిసిన తరుణంలో రాష్ట్రానికి కొత్త సీఎస్ రానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి స్థానంలో శశాంక్ గోయల్, కె.రామకృష్ణారావు, అరవింద్ కుమార్, జయేశ్ రంజన్, సంజయ్ జాజు, వికాస్‌రాజ్ పేర్లను సర్కారు పరిశీలిస్తోంది. సీఎస్ సహా IAS, IPS అధికారులను బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు డీజీపీ రవిగుప్తాను కొనసాగించే అవకాశం ఉందని సమాచారం.

సంబంధిత పోస్ట్