తెలంగాణ మంత్రులకు కొత్త ల్యాండ్ క్రూజర్ కార్లు

59చూసినవారు
తెలంగాణ మంత్రులకు కొత్త ల్యాండ్ క్రూజర్ కార్లు
తెలంగాణ ప్రభుత్వం మంత్రులకు కొత్త వాహనాలు అందించింది. గత ప్రభుత్వం అప్పటి సీఎం కేసీఆర్ కాన్వాయ్ కోసం 22 టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను కొనుగోలు చేశారు. అయితే, బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆ కొత్త వాహనాలు అలాగే ఉండిపోయాయి. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పాత కాన్వాయ్‌నే ఉపయోగిస్తున్నారు. దీంతో ఆ ల్యాండ్ క్రూయిజర్ కార్లను కాంగ్రెస్ ప్రభుత్వం భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది మంత్రులకు కేటాయించింది.

సంబంధిత పోస్ట్