కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ చిరకాల అనుచరుడు పీపీ మాధవన్ (73) సోమవారం కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. మంగళవారం కేరళలోని త్రిసూర్‌లో మాధవన్ అంత్యక్రియలు నిర్వహించగా.. రాహుల్ గాంధీ అక్కడికి చేరుకొని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. మాధవన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.