కేరళలో బాలుడికి నిపా వైరస్

66చూసినవారు
కేరళలో బాలుడికి నిపా వైరస్
కేరళలో నిపా వైరస్ కేసు తాజాగా వెలుగు చూసింది. మలప్పురంలోని పాండిక్కాడ్ పంచాయతీకి చెందిన 14 ఏళ్ల బాలుడికి నిపా వైరస్ ఇన్ఫెక్షన్‌ వచ్చింది. ప్రస్తుతం బాలుడు కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఆ గ్రామంలో ఆంక్షలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. 214 మందిని పరిశీలనలో ఉంచామని, వారిలో 60 మంది హై రిస్క్ కేటగిరీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్