మద్యం మత్తులో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

63చూసినవారు
మద్యం మత్తులో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
ఖానాపూర్ మండలంలోని అడవి సారంగాపూర్ అనుబంధ జిల్లెడు కుంటకు చెందిన తోడసం హిరామన్ మద్యం మత్తులో పురుగుల మందు తాగి మృతి చెందాడని ఖానాపూర్ ఎస్సై లింబాద్రి తెలిపారు. హిరామన్ మద్యం తాగి వచ్చి ఇంట్లో భార్యతో గొడవ పడగా, ఆయన భార్య మందలించిందన్నారు. దీంతో క్షణికావేశంలో హీరామన్ తాగిన మైకంలో గుర్తుతెలియని పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ నిర్మల్ ఆస్పత్రిలో మృతి చెందాడన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్