పెంబీ ఎంపీడీవోకు ఉత్తమ సేవా అవార్డు

59చూసినవారు
పెంబీ ఎంపీడీవోకు ఉత్తమ సేవా అవార్డు
పెంబి మండల ఎంపీడీవో రజనీకాంత్ ఉత్తమ సేవ పురస్కారం అందుకున్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కలెక్టర్ అభిలాష అభినవ్, తదితర ఉన్నత అధికారులు ఉత్తమ సేవ అవార్డును అందించారు. అన్ని గ్రామాలలో ప్రభుత్వ ప్రణాళికను విజయవంతంగా అమలు చేయడం, పథకాలను ప్రజలకు చేరవేసినందుకు అవార్డు లభించింది.

సంబంధిత పోస్ట్