వ్యక్తికి గాయాలు

59చూసినవారు
వ్యక్తికి గాయాలు
ఉట్నూరు మండలంలోని పులిమడుగు ఆందోలి గ్రామాల మధ్య ఉన్న మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి ఘటనలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి ఆ మూలమలుపు వద్ద బైక్ అదుపు తప్పి పడిపోవడంతో వ్యక్తి ముఖానికి గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని దంతన్పల్లి వాసిగా స్థానికులు గుర్తించారు. బిఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులు బాబా శామ్ టైగర్, యువకులు అక్కడకు చేరుకుని గాయపడ్డ వ్యక్తిని అంబులెన్స్ లో ఉట్నూర్ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్