అభివృద్ధి పనుల పరిశీలన

69చూసినవారు
అభివృద్ధి పనుల పరిశీలన
దండేపల్లి మండలంలోని గుడిరేవు గ్రామ గోదావరి తీరంలో కొలువుదిరిన ఆదివాసీల ఆరాధ్య దేవత పద్మల్ పూరి కాకోబాయి ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులను వెడ్మ బొజ్జు పటేల్ యువ సైన్యం సభ్యులు పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం వారు ఆ దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ ఎమ్మెల్యే హామీ మేరకు చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్