ఖానాపూర్ మండల ఎస్సై జి. లింబాద్రిని ఖానాపూర్ మండలానికి చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు సన్మానించారు. ఖానాపూర్ ఎస్సై లింబాద్రి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. దీంతో శుక్రవారం సాయంత్రం ఖానాపూర్ జర్నలిస్టులు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐ లింబాద్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్సై లింబాద్రిని వారు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.