చట్టసభలలో బీసీల రిజర్వేషన్ల పెంపును మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యతగా తీసుకోవాలని బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలలో చాలామంది బీసీలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా గెలవడం సంతోషంగా ఉందన్నారు. అదే సమయంలో వారు బాధ్యతను తీసుకుంటే చట్టసభలలో రిజర్వేషన్ల పెంపు వీలవుతుందని, ఆ విధంగా కృషి చేయాలని ఆయన కోరారు.