ఖానాపూర్ మండలంలో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

77చూసినవారు
ఖానాపూర్ మండలంలో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ రాంసింగ్ తెలిపారు. మండలంలోని సూర్జాపూర్ సబ్స్టేషన్లో నూతన 11 కెవి ఫీడర్, బ్రేకర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో సబ్స్టేషన్ పరిధిలోని సూర్జాపూర్, బాదంకుర్తి, మస్కాపూర్, మేడంపల్లి, వెంకటాపూర్ గ్రామాలలో ఉదయం 9 నుంచి 2 గంటల వరకు కరెంట్ ఉండదన్నారు.

సంబంధిత పోస్ట్