ఉట్నూర్ మండల కేంద్రంలోని అంబెడ్కర్ చౌక్ వద్ద ఆదివారం ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు గణేశ్ మాట్లాడుతూ సీపీఎస్ పెన్షన్స్ విధానం ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు శాపంగా మారిందన్నారు. వెంటనే సీపీఎస్ ను రద్దుచేసి ఓపీఎసను అమలు చేయాలన్నారు. అలాగే ఐటీడీఏలో పనిచేస్తున్న భాషా పండితులకు పీఈటీలను అప్గ్రేడ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.