రోడ్లపై పడిపోయిన చెట్లు.. తొలగించిన పోలీసులు

65చూసినవారు
జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు ఖానాపూర్ పట్టణ శివారులోని కొమరం భీమ్ చౌరస్తా నుండి తర్లపాడు వెళ్లే మధ్యలో పలు చోట్ల ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్పందించిన స్థానిక సీఐ సైదారావు అక్కడికి చేరుకుని స్థానిక ప్రజలు, పోలీస్ సిబ్బందితో కలిసి పడిపోయిన చెట్లను తొలగించి వాహనాల రాకపోకలను క్లియర్ చేశారు.

సంబంధిత పోస్ట్