ఖానాపూర్ పట్టణంలోని పలువురు ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడ్డారని స్థానిక ఎస్ఐ లింబాద్రి తెలిపారు. విద్యానగర్ కు చెందిన కుమారస్వామి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు రూ. 1. 50 లక్షలు, ఆయన ఇంటి పక్కనే ఉన్న జానుబాయి ఇంట్లో రూ. 3200 విలువ చేసే మట్టెలు దొంగలించారన్నారు. మరో రెండు ఇళ్లల్లో దొంగలు దొంగతనానికి ప్రయత్నించారన్నారు. జడల కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నామన్నారు.