ఒకవైపు ఎండా మరోవైపు వర్షం
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో భిన్న వాతావరణం నమోదవుతోంది. నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంగళవారం మ. 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే నాలుగు గంటల తర్వాత చాలాసేపు భారీ వర్షం కూడా కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది. రాబోయే రెండు రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదు కావచ్చని అధికారులు తెలిపారు. ఒకటి రెండు చోట్ల వర్షాలు కూడా పడవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.