భైంసా పట్టణంలోని పురాణబజార్లో ఆదివాసీ నాయకపోడు కులస్థుల ఆధ్వర్యంలో భీమన్న దేవుని పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో బాజాబజంత్రీలు, డప్పు చప్పుళ్లతో వృత్తాలు చేస్తూ భీమన్న ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పుష్కలంగా పండాలని మొక్కులు మొక్కుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.