బాసర పుణ్యక్షేత్రంలోని శ్రీ పాపహారేశ్వర ఆలయ శిఖర, ఉత్సవ విగ్రహ పున ప్రతిష్టాపన మహోత్సవాలు శనివారం వేద మంత్రోచ్ఛరణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గణపతి, సంతాన నాగేంద్రుడు, అన్నపూర్ణ తదితర ఉత్సవమూర్తులకు గోదావరి నది జలాలతో అభిషేకం, అర్చన నిర్వహించారు. అంతకుముందు ఉదయం విగ్రహాలను గ్రామ వీధుల గుండా మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్లారు.