ప్రభుత్వం సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం భైంసా మండల ఉద్యానాధికారి కార్యాలయం వద్ద మండల సమగ్ర శిక్షా ఉద్యోగులు నిరసన చేపట్టారు. రెగ్యులర్ చేసి తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని, పిటిఐ లకు, ఎస్ఎస్ఏ ఉద్యోగుల వలే 12 నెలల వేతనం ఇవ్వాలని, జీవిత బీమా, ఆరోగ్య బీమా రూ. 10 లక్షలు, పదవీ విరమణ బెనిఫిట్స్ క్రింద 10 లక్షలు అందించాలని డిమాండ్ చేశారు.