శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరావస గ్రామస్తులందరికీ ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. మంగళవారం భైంసాలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అయన మాట్లాడారు. సంవత్సరాల తరబడి అప్పటి ప్రభుత్వం స్థలాలు ఇచ్చినప్పటికీ హక్కు పత్రాలు లేకపోవడంతో రుణాలు కావాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విషయమై సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు