పూర్తిగా నిండిన గడ్డెన్న వాగు ప్రాజెక్టు

58చూసినవారు
ఎగువ కురుస్తున్న వర్షాలకు భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 200 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358. 70 మీటర్లు కాగా, ప్రస్తుత ప్రాజెక్టు పూర్తిగా నిండి ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నిండి ఉన్నందున గేట్లు ఎత్తే అవకాశం ఉందని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్