భైంసా మండలం కుంబి గ్రామంలో శనివారం ఎన్డీఎఫ్ రూ. 2 లక్షల నిధులతో గ్రావెల్ రోడ్డు పనులను ప్రారంభించారు. రోడ్డు పనులకు నిధులను మంజూరు చేసిన సందర్భంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డికి స్థానిక ప్రజలు ధన్య వాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, నాయకులు, తదితరులు ఉన్నారు.