అనారోగ్యంతో బాధపడుతూ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన గంగారాం గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రుల్లో వైద్యం చేపించుకున్న తగ్గకపోవడంతో మనస్తాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుంటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.