కుంటాల మండలం అంబకంటి గ్రామం నుండి నుంచి నర్సాపూర్ (జి) మండలం నందన్ వరకు వెళ్లే రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఈ విషయమై పలువురు బీజేపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించి ప్రభుత్వ సహకారంతో రూ. 2కోట్ల నిధులు మంజూరు చేయించడంతో బుధవారం ఆయన చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో వెంగళరావు,
లింగదాస్ పటేల్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.