వాజ్‌పేయి జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే

65చూసినవారు
మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి 99వ జయంతిని సోమవారం ముధోల్ నియోజకవర్గ బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. జయంతి సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భైంసా పట్టణంలోని ఆయన నివాసంలో చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వాజ్‌పేయి జీవితాంతం దేశాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్