మరదలిపై వదిన కత్తితో దాడికి పాల్పడిన ఘటన బుధవారం ముథోల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మండల కేంద్రంలోని సాయి మాధవ్ నగర్ లో అద్దెకు ఉంటున్న ఎస్బీఐ ఉద్యోగి హనుమంత్ రావు భార్య అశ్విని ఆయన చెల్లిపై మారు వేషంలో వచ్చి కత్తితో దాడికి పాల్పడింది. గమనించిన స్థానికులు వెంటనే బాధితురాలిని హుటాహుటిన భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.