ముధోల్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన 25 మందికి సుమారు 10లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పటేల్ పంపిణీ చేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శంకర్ చేంద్రే, మాజీ ఎంపీపీ బోజరాం పటేల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.