ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పీఆర్టీయు 2025 క్యాలెండర్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. పీఆర్టీయు తరఫున ఎమ్మెల్యేకి సన్మానించి మిఠాయిలు తినిపించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.