జెండా పండగ సందర్భంగా పాఠశాల ఉదయం చిన్నారులు, ఉపాధ్యాయులతో కళకళలాడాలి. కానీ సమన్వయలోపంతో భైంసా మండలం ఖత్గాం ప్రాథమిక పాఠశాల ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఏ ఒక్కరూ హాజరు కాలేదు. జెండా పండగకు వచ్చిన విద్యార్థులు వెనుదిరిగి వెళ్లారు. జెండా పండగ సందర్భంగా ఉపాధ్యాయులు లేకపోవడాన్ని తప్పుపడుతూ గ్రామస్థులు పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేశారు. ఉపద్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.