ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భైంసా మండలం పెండ్పల్లి గ్రామం నుంచి వానల్పాడ్ గ్రామాల మధ్య రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెండ్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గురువారం రోడ్డుకు మరమ్మతులు చేయించారు. రోడ్డుపై మొరంతో గుంతలను పూడ్చి బాగుచేయించారు. రోడ్డును బాగు చేయించిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులను పలువురు అభినందించారు.