జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపిక

478చూసినవారు
జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపిక
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని కోలూర్ గ్రామానికి చెందిన షేక్ అత్తర్ జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికవ్వడం అభినందనీయం మని తానూర్ మండల కో ఆప్షన్ సభ్యులు కదం గోవింద్ రావు పటేల్ అన్నారు. కోలూర్ గ్రామం లో వడ్గాం సర్పంచ్ సంతోష్ పటేల్ తో కలిసి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన షేక్ అత్తర్ ను శనివారం పూలమాల వేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా గోవింద్ పటేల్ మాట్లాడుతూ కోలూర్ గ్రామానికి చెందిన షేక్ అత్తర్ జాతీయస్థాయి పోటీల్లో ఎంపికవ్వడం చాలా గర్వకారణమన్నారు. హైదరాబాద్ లో -23ఫ్రీ స్టైల్ సెలక్షన్ ట్రాయ్ఎల్స్ లో 72 కేజీల విభాగం రెజ్లింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించి, రాష్ట్ర స్థాయిలో ఎంపికై, ఈనెల 16 నుంచి19వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ లోని అమేథీ లో జరిగే 3వ అండర్ 23ఆ జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికవ్వడం అభినందనీయం మని అన్నారు. జాతీయ స్థాయిలో గెలుపొందలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వడ్గాం సర్పంచ్ సంతోష్ పటేల్, ఉపసర్పంచ్ ఎం. సాయినాథ్, మాజి సర్పంచ్ ఆత్మారాం, ఏక్బాల్ సాబ్, వార్డు మెంబర్ సలీం, నాయకులు దర్మేంధర్, నామ్ దేవు, శంకర్, లాల్ పాషా, అబ్దూల్ గని, తదితరులు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్