కుంటాల మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో గురువారం జరగబోయే నిమజ్జనం శోభయాత్రను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్ఐ భాస్కరచారి ఒక ప్రకటనలో తెలిపారు. శోభయాత్రలో అధిక సౌండ్ ఉన్న డీజేలను పెట్టవద్దని పూర్తిస్థాయిలో పోలీసులకు సహకరిస్తూ, పోలీస్ నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.