బాసర వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నది బ్లాక్ వాటర్ వల్ల 3 బిటి రోడ్లు నీటిలో మునిగిపోవడంతో గురువారం బాసర మండల కేంద్రం నుండి కిర్గుల్(కే), కిర్గుల్(బి), ఓని, కౌఠ, సురెల్లి, సాలాపూర్. సావర్గావ్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. గోదావరి గాట్1 నుండి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్లే ప్రధాన రోడ్డు సైతం నీట మునిగడంతో భక్తుల రాకపోకలు నిలిచాయి.