తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం తానూరు మండల మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ.. ఏడు నెలలుగా జీతాలు, ఐదు నెలలుగా బిల్లులు రాక విద్యార్థులకు వంట చేయడానికి అప్పులు చేసి పని చేస్తూ వచ్చినా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.