భైంసా పట్ణణంలో తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతచారి జయంతి సందర్భంగా గురువారం బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన తెలంగాణ అమర వీరుడు శ్రీకాంత్ చారి అని కొనియాడారు. శ్రీకాంత చారి జయంతి ఉత్సవ కమిటీ అద్యక్షులు వర్లె గంగాధర్, శ్రామోజీ వార్ గోవింద, రామా కృష్ణా, బెజంకి శ్రీనివాస్, సుంకెట పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.