త్వరలో సమస్యను పరిష్కస్తాం: ఆర్డీఓ

61చూసినవారు
కుబీర్ మండల కేంద్రంలో విఠలేశ్వర స్వామి ఆలయంలోకి మురికి నీరు రాకుండా డ్రైనేజీ పై నిర్మించిన అక్రమాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం గ్రామస్తుల ఆధ్వర్యంలో రోడ్డుపై కూర్చొని ధర్నా చేపట్టారు. ఉదయం నుండి ధర్నా కొనసాగింది. విషయం తెలుసుకున్న భైంసా ఆర్డీఓ కోమల్ రెడ్డి గ్రామానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు. అక్రమాలను తొలగించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంలో ధర్నా విరమించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్