జైనుర్ లో గిరిజన మహిళపై అత్యాచార, హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బిజెపి జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు రజిని డిమాండ్ చేశారు. శుక్రవారం గిరిజన మహిళకు న్యాయం చేయాలంటూ నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రత్న కళ్యాణికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జైనూర్ ఘటన నిందితుడిని తీవ్రంగా శిక్షించాలని కోరారు. ఇందులో బిజెపి మహిళా మోర్చా నాయకులు పాల్గొన్నారు.