జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలూరులో మండల స్థాయి తెలంగాణ ఇంగ్లీష్ ఒలంపియాడ్ ప్రతిభ పరీక్షను మండల విద్యాధికారి యం. నరేందర్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఆ పరీక్షకు న్యాయ నిర్ణేతలుగా శౌరి రెడ్డి, ప్రవీణ్, సుమతి వ్యవహరించారు. ప్రతిభ పరీక్షలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం పొందిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం నరేందర్ బహుమతులను శుక్రవారం ప్రదానం చేశారు.