ఆర్మూర్ పట్టణం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఇటీవల గర్భస్థ శిశువు మరణానికి కారణమైన వైద్యు రాలిపై చర్యలు తీసుకోవాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అనీఫ్ ఆర్మూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ రవికుమార్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరికొండ మండలానికి చెందిన బాధితురాలు ఈనెల 3న చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే వైద్యురాలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.