ఆర్మూర్ పట్టణం లో జర్నలిస్ట్ కాలని ఆలయ కమిటి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాసం రెండవ సోమవారం పురస్కరించుకుని కాలనీలోని మహిళలు 50 మంగళ హారతులతో వచ్చి హనుమాన్ మందిరంలో గల శివలింగానికి వేయి దీపాలు వెలిగించి సహస్ర దీపాలంకరణ చేసి స్వామి వారిని పూజించారు. ఆట పాటలతో ఆలయం మారుమ్రోగింది. భక్తి శ్రద్ధలతో కాలనీలోని ప్రతీ కుటుంబాన్ని, చల్లగా చూడాలని భగవంతున్ని ప్రార్థించారు.