ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని పెర్కిట్ శివారులో 44వ నవంబర్ జాతీయ రహదారిపై భారత పెట్రోల్ పక్కన ఉన్న ఐదు దుకాణాలు బుధవారం ఉదయం దగ్ధమయ్యాయి. దీనికి కారణం షాపులో షార్ట్ సర్క్యూట్ అయ్యి పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించగా మంటలను కంట్రోల్ చేశారు. జాతీయ రహదారి ప్రక్కన ఉన్న ఐదు దుకాణాల్లో కిరాణా షాప్, హోటల్, ఆటోమొబైల్ షాపులను పలువురు నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు.