నందిపేట మండలం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం NSS అధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా NSS పీఓ లక్ష్మన్ శాస్త్రి మాట్లాడుతూ శిలాజ ఇంధనాలను తగ్గించుకుని, పునరుత్పాదక వనరుల వినియోగాన్ని పెంచుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రాజ్ కుమార్, HODs కిషోర్, లావణ్య, AO తులసిరామ్, లెక్చరర్స్ పాల్గొన్నారు.