ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య శ్రీనివాస్ అన్నారు. బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం నిరుపేదలకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ మహిళ సంగా భవనంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని చెప్పారు.