నిజామాబాద్: ఇటీవల రాష్ట్రస్థాయిలో సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డు పొందిన కవి, రచయిత సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ లాల్ అభినందన సభ ఏర్పాటు చేసి శాలువా జ్ఞాపికతో శుక్రవారం ఘనంగా సన్మానించారు. స్వరాంజలి అధ్యక్షుడు వేముల శేఖర్ సన్మానించిన అనంతరం మాట్లాడుతూ రచయితలకు ప్రేమ లాల్ చేస్తున్న కృషికి గుర్తింపుగా అవార్డు లభించడం సంతోషంగా ఉందన్నారు.