ఆర్మూర్ మండలం గోవింద్ పెట్ గ్రామంలో ఐసిడిఎస్ మండల సెక్టార్ ఆధ్వర్యంలో పోషణ అభియాన్ పోషణ మహా కార్యక్రమం అంగన్వాడి సొంత భవనంలో నిర్వహించారు. ఆర్మూర్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఏరియా సూపర్వైజర్ నళిని మాట్లాడుతూ గర్భిణీలకు సీమంతలతో పాటు బాలింతలకు 3 నుంచి 6 సంవత్సరాల చిన్న పిల్లలకు ఆరోగ్యంగా ఉండుటకు పౌష్టిక ఆహారం ఏ విధంగా తీసుకోవాలి అనే అంశంపై, తల్లి బిడ్డల సంక్షేమం పోషణ అభియాన్ లక్ష్యమని అన్నారు.