నిజామాబాద్ జిల్లా బాల్కొండ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నాయకులు హైదరాబాద్ లోని తన నివాసంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తనకు శుభాకాంక్షలు చెప్పిన ముఖ్య నాయకులకు వేముల ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.