నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలంలోని ఎంజి తాండ పరిధిలో కొనియా తాండ భూక్య మోతిలాల్ ఇల్లు బుధవారం రాత్రి దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి వెంటనే స్పందించి గురువారం ఎమ్మార్వో తో ఫోన్లో మాట్లాడి ఆ కుటుంబానికి పప్పు ధాన్యాలు, బియ్యం ఆర్థిక సాయం చేసారు.